బెంగళూరులో భారీగా బంగారం సీజ్.. ఎక్కడ దాచారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం స్మగ్లర్ల పాలిట వరంగా మారుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే టార్గెట్ గా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారం సీజ్ చేశారు. కొలంబో ప్రయాణీకుల వద్ద 1.53 కోట్ల రూపాయల విలువ చేసే 3.1 కేజీల బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.
కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చారు. ఆ పేస్టును క్యాప్సుల్స్ రూపంలోకి మార్చారు. సినీ ఫక్కీలో ఈ క్యాప్సుల్స్ ని మింగించారు. మలద్వారంలో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్ళు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో 10 మంది ముఠా సభ్యుల పై అనుమానం కలగడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేశారు కస్టమ్స్ బృందం. కడుపులో దాచిన బంగారం గుట్టును రట్టు చేసారు కస్టమ్స్ అధికారులు. బంగారం సీజ్ చేశారు. 10 మంది ప్రయాణీకుల పై కేసు నమోదు చేశారు. కేసుని దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్‌ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్‌ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!