ఒకవైపు నిత్యావసరాలు, మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే టెలికాం కంపెనీలు మాత్రం బాదుడు మానలేదు. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ 20 శాతం టారిఫ్ పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని భారీగా పెంచింది. పెరిగిన ధరలు ఈ వారంలోనే అమల్లోకి రానున్నాయి.
ప్లాన్ల ధరల్ని 20 నుంచి 25 శాతం వరకు పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. 2019 డిసెంబర్‌లో ఓసారి టారిఫ్‌ను పెంచింది ఎయిర్‌టెల్. రెండేళ్ల తర్వాత ఇప్పుడు టారిఫ్ పెంచుతున్నట్టు తెలిపింది. పెరిగిన టారిఫ్ నవంబర్ 26 నుంచి అమలులోకి రానుంది. ఆర్థిక ఆరోగ్యపరమైన బిజినెస్ మోడల్ కోసం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగాలంటోంది ఎయిర్ టెల్. అందుకే ప్రీపెయిడ్ ప్లాన్స్ టారిఫ్ పెంచుతున్నామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. భారతదేశంలో 5జీ తీసుకురానున్నామని, అందుకోసం ఇది ఉపయోగపడగలదని తెలిపింది.
రూ.79 ..ఇక రూ.99
ఇప్పటివరకూ అమలులో వున్న రూ.79 ప్లాన్ తీసేసింది. ఆ ప్లాన్ రూ.99 కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 200ఎంబీ డేటా వాడుకోవచ్చు. వాయిస్ టారిఫ్ సెకన్‌కు ఒక పైసా చొప్పున చెల్లించాలి. 50 శాతం ఎక్కువ టాక్‌టైమ్ వస్తుందని చెబుతోంది.
రూ.149..ఇక రూ.199
రూ.149 ప్లాన్‌ను రూ.179కి పెంచేసింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 2జీబీ డేటా లభిస్తుంది.
రూ.219.. ఇక రూ.265
రూ.219 ప్లాన్‌ను రూ.265కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు.
రూ.249.. ఇక రూ.299
రూ.249 ప్లాన్‌ను రూ.299కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.
రూ.298.. ఇక రూ.359
రూ.298 ప్లాన్‌ను రూ.359కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.
రూ.399.. ఇక రూ.479
రూ.399 ప్లాన్‌ను రూ.479కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది.
రూ.479..ఇక రూ.549
రూ.449 ప్లాన్‌ను రూ.549కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది.
రూ.379 …ఇక రూ.455
ప్లాన్‌ను రూ.455కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. మొత్తం 6జీబీ డేటా లభిస్తుంది.
రూ.598 …ఇక రూ.719
రూ.598 ప్లాన్‌ను రూ.719కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది.
రూ.698 ప్లాన్‌ను రూ.839కి, రూ.1498 యాన్యువల్ ప్లాన్‌ను రూ.1799, రూ.2498 యాన్యువల్ ప్లాన్‌ను రూ.2999కి పెంచింది. అంతేకాకుండా, రూ.48 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.58కి పెంచింది. రూ.98 డేటా టాప్‌అప్ కోసం ఇకపై రూ.118 చెల్లించాలి. రూ.251 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.301 కి పెంచింది.