హైదరాబాద్ బోరబండలో ఇద్దరు విద్యార్ధులు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బోరబండలో 6,7 తరగతి చదువుతున్న ఇద్దరు అన్నా, తమ్ముళ్లు ఆదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3 లేబర్ అడ్డా ప్రాంతానికి చెందిన రాజు నాయక్ ఇద్దరు కుమారులైన గణేష్(10), రమేష్(12)లు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు.
మంగళవారం ఉదయం పనికి వెళ్ళారు తల్లిదండ్రులు. అయితే, సాయంత్రం ఇంటికి వచ్చే చూసే సరికి పిల్లలిద్దరూ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేదు. దీంతో ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.