మీరెలాంటి పాస్ వర్డ్ వాడుతున్నారు.. అది సేఫేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగినా కొన్ని సాంకేతిక పరమయిన ఇబ్బందులు తప్పడం లేదు. హ్యాకర్లు మనమీద ఓ కన్నేసి వుంచుతున్నారు. అవకాశం చిక్కితే మన సొమ్ము లాగేయడానికి సిద్ధంగా వుంటారు. వీక్ పాస్ వర్డ్ ల విషయంలో ముందువరుసలో భారత్ ఉంది. సులభమైన పాస్వర్డ్స్ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించే ప్రమాదం వుంది. పాస్వర్డ్స్ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్ క్రోమ్ తనవంతు పాత్ర పోషిస్తోంది. మన ఆన్లైన్ ఖాతాలకు సెట్ చేసిన పాస్వర్డ్స్ భద్రంగా ఉన్నాయా లేదా అన్న చిన్న సందేహం వస్తుంది. మన బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్స్.. ఇలా ఏ అకౌంట్స్ నుంచైనా మన వ్యక్తిగత సమాచారం వారికి దొరికిందంటే మన కథ కంచికి చేరినట్టే.
అలా జరగకుండా పాస్వర్డ్స్ విషయంలో మనం అప్రమత్తం కావాలి. మన పాస్ వర్డ్ హ్యాక్‌కు గురవుతుందనే ఆందోళన ఇక అవసరం లేదు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఎప్పుడైనా హ్యాకింగ్‌కు గురైతే వెంటనే గుర్తించి నోటిఫికేషన్ రూపంలో మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. పాస్వర్డ్ చెకర్ ద్వారా వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను క్రోమ్‌లో సేవ్ చేసుకోవాలి. ట్విటర్, ఫేస్బుక్, జీమెయిల్, బ్యాంక్ అకౌంట్స్… ఇలా ఏ అకౌంట్ అయినా గూగుల్‌తో సింక్ అయివుండాలి. ఎప్పుడైనా మీ అకౌంట్స్‌ను మీ అనుమతి లేకుండా ఎవరైనా యాక్సెస్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంటే ఒకసారి చెక్ చేసుకునే అవకాశం వుంది.
Also Read
- National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో 'క్రిటికల్ థింకింగ్'
- Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
- World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
- Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
మీ అకౌంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను గూగుల్ క్రోమ్ సర్వర్లకు పంపి విశ్లేషించే సౌలభ్యం వుంది. మీ పాస్వర్డ్ తేలికగా, ఈజీగా వుంటే మార్చుకోవచ్చు. హ్యాకర్స్‌కు దొరక్కుండా వుండాలంటే ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ని మరోసారి వాడకూడదని సలహా ఇస్తున్నారు టెక్ నిపుణులు. కొందరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా అన్ని ఆన్లైన్ ఖాతాలకు ఒకే పాస్వర్డ్ ఉపయోగిస్తారు. అది ఎంతమాత్రం మంచిదికాదు. పాస్వర్డ్స్ ఎప్పుడూ అక్షరాలు, సింబల్స్, పంక్చువేషన్తో కలిసి ఉండాలి. ఫోన్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్, పిల్లల పుట్టిన రోజులు వుండకూడదు. తరచూ మీ పాస్ వర్డ్ మార్చుకుంటూ వుండండి.
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!