ఈజీమనీ కోసం దొంగతనాలు చేసేవారు ఎక్కువయ్యారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో వారి ఆటలు సాగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలు చేసేవారు గుట్టు రట్టవుతోంది. సీసీ కెమేరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, జీపీఎస్ ద్వారా దొంగల్ని పట్టుకుని సొత్తు రికవరీ చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీపీఎస్ ద్వారా బుల్లెట్ దొంగలు పట్టుబడ్డారు. కడియపులంకలో చోరీకి గురైన రెండు లక్షల రూపాయల బుల్లెట్ జీపీఎస్ ద్వారా గుర్తించారు పోలీసులు. చోరీకి గురైన తన […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు ఉన్నారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఏకగ్రీవమైనవారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారులు అందజేస్తారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. […]
కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. ఆర్టీపీపీలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 13, 6 యూనిట్లలో కలిపి 600 మెగావాట్లు […]
బంగారం రేటు పెరుగుతుండడంతో కేటుగాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. బంగారాన్ని విదేశాలనుంచి అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. వివిధ రూపాల్లో బంగారం దేశంలోకి ఎంటరవుతోంది. పేస్టు రూపంలో, బ్యాగ్ లు, సెల్ ఫోన్ బ్యాటరీలు, క్యాప్సుల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల రూపంలో .. కస్టమ్స్ కళ్ళుగప్పి మరీ తెచ్చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్.. ఎయిర్ పోర్టులు వేరైనా జరిగేది మాత్రం బంగారం స్మగ్లింగ్. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కొలంబో ప్రయాణీకుల వద్ద 86 […]
ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై ఆన్ లైన్లోనే టికెట్ల విక్రయం జరగనుంది. దీనిపై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రోజుకు కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఏపీలో సినిమా టికెట్ బుకింగ్‌కి సంబంధించి ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ […]
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చే కార్యక్రమాలకు, ప్రత్యక్ష ప్రసారాలకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తూన్న సుప్రభాత సేవ కైంకర్యాల ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపివేసారు అని నిలదీశారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఏడాది ముందుగానే అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆల్ ఇండియా రేడియా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామివారి పూజా […]
ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది. ఈ నేపథ్యంలో ఆదాయం సమకూర్చుకునేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో వడి వడిగా అడుగులేస్తోంది ప్రభుత్వం. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను గ్రామ, వార్డు సెక్రటరీలకు దఖలు పరిచింది జగన్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆదాయంపై కన్నేసింది. ఈ పథకం ద్వారా ఖజానా నిండుతుందని ఆర్థిక […]
ఇండియాకు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే వాహనాలకు అనుమతిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పదంతోనే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైనా ఆహారం అందక అలమటిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. Read: విచిత్రం: అంతపెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది? కాగా, ఇండియా […]
రైతుల ఉసురు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సీజన్లో ధాన్యం ఎంతయినా కొనాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ ముందుకు పోలేదని కేసీఆర్ […]
చిన్న చిన్న చేపలను పాములు తినేస్తుంటాయి. అయితే, పాములను చేపలు తినడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. ఓ చేప నీటి కొలను ఒడ్డున ఉన్న ఓ బొరియవైపు ఒపికగా చూస్తూ ఉన్నది. అంతలో ఆ బొరియ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అలా వచ్చిన ఓ పామును నీటిలో ఉన్న ఆ చేప మెల్లిగా మింగడం మొదలు పెట్టింది. అది చిన్న చేప అనుకుంటే పొరపాటే. దాదాపు మూడున్నర అడుగుల పాము. ఆ […]