సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్‌ఎంబీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు రెండు రాష్ర్టాల జనవనరుల కార్యదర్శులకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. సాగు,తాగు అవసరాలకు లేకుండా ఇష్టారీతిన విద్యుదుత్పత్తిని చేశారని కేఆర్‌ఎంబీ లేఖలో పేర్కొంది.
సముద్రంలోకి 55.96 టీఎంసీలు వృథాగా పోతున్నాయని వెల్లడించింది. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్‌ఎంబీ తెలిపింది. ఇప్పటికైనా విద్యుదుత్పత్తి ని వెంటనే నిలపి వేయకపోతే భవిష్యత్ నీటి అవసరాలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని కేఆర్‌ఎంబీ హెచ్చరించింది. నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తిని చేయొద్దని చెప్పింది.