ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కడపజిల్లాలో నిన్న అర్ధరాత్రి ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు,40 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీల మధ్య ఛేజింగ్ జరిగింది. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె చెక్ పోస్టు వద్ద నుండి ఐచర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు.
ఫారెస్టు అధికారుల దాడిని తప్పించుకునేందుకు ప్రొద్దుటూరు వైపు ఐచర్ వాహనంలో పరారవుతూ వాహనంలో నుండి దూకి పారిపోయారు 45 మంది తమిళనాడు కూలీలు. బొజ్జవారిపల్లె వద్ద వాహనంలో నుండి దూకడంతో తమిళనాడుకు చెందిన ఒక ఎర్రచందనం కూలీ ఒకరు మృతి చెందాడు. ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారుల అదుపులో ఉన్న నలుగురు తమిళనాడు కూలీలను విచారిస్తున్నారు.