ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ ముందుకు రానుంది కాగ్ నివేదిక. మరోవైపు అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్ చెప్పారు. సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లో ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.