ఢిల్లీ కాలుష్యం పై సుప్రీం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో కాలుష్యాన్ని 24 గంటల్లోగా అరికట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సూచించకపోతే.. కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము మీకు 24 గంటలు ఇస్తున్నాము. మీరు దీనిని తీవ్రంగా పరిశీలించి, సీరియస్‌గా పరిష్కారం చూపాలని కోరుతున్నామని అని జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపిస్తూ, గాలి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో టాస్క్‌ఫోర్స్ తనిఖీ చేయాలని అన్నారు. సెంట్రల్ విస్టాతో సహా నిర్మాణ స్థలాలను కూడా సందర్శించాలి. కాలుష్య నిబంధనలను ఉల్లంఘించే ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలను సీల్ చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు అధికారం కల్పించాల్సిన అవసరం ఉందని సింగ్ అన్నారు. నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
Also Read
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
దీనిపై సీజేఐ మాట్లాడుతూ.. చర్యలు తీసుకుంటున్నామని మీరు చెప్పినప్పుడు మీ మాటలు నిజమేనన్నారు. పాఠశాలలు మూతపడ్డాయని మీరు చెప్పారు. కానీ పాఠశాలలు మూసివేయడం లేదు. చిన్న పిల్లలు ఇంకాస్కూళ్లకు వెళ్తున్నారు. ఢిల్లీలోని పాఠశాలలు మరియు ఇతర విద్యాసంస్థలు 15 రోజుల పాటు మూసివేయబడ్డాయి, అయితే అవి నవంబర్ 29న తిరిగి తెరుచుకున్నాయి.ఈ రోజు వార్తా పత్రికలు చూడండి పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. అమలును పర్యవేక్షించడానికి ఒకరిని నియమించారా అని కోర్టు ప్రశ్నించింది.
మీరు ఏమి చేసారు? యువకులు మరియు బాలికలు, ముసుగులు కూడా ధరించకుండా, పోస్టర్లతో రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు,” సీజేఐ పేర్కొన్నారు. పబ్లిసిటీ కాకుండా ఏం చేసావ్?” అని సీజేఐ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ, ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయని వాదించారు. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి మరియు కాలుష్య మూలాలపై అధ్యయనం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం IIT కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది” అని సింఘ్వీ చెప్పారు.
ప్రభుత్వ అఫిడవిట్‌ను సింఘ్వీ ప్రస్తావించారు.ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కోర్టుకు వివరించారు. ఇది కాలుష్యానికి మరొక కారణం, ప్రతిరోజూ చాలా అఫిడవిట్లు ధాఖలైతున్నాయని సుప్రీం బెంచ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ యువకుల్లో ఎంతమంది రోడ్డున పడ్డారో అఫిడవిట్‌లో వెల్లడించారా? పబ్లిసిటీ కోసమా?.. చేతిలో బ్యానర్‌తో ఓ యువకుడు రోడ్డు మధ్యలో నిల్చున్నాడు.. ఏంటి.. వాళ్ల ఆరోగ్యం గురించి ఎవరైనా జాగ్రత్త వహించాల్సిందేనని సుప్రీం బెంచ్ తెలిపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?