హైదరాబాద్ లో ఓ హోటల్‌లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా పనిలో చేరాడు.
ఈరోజు సుమారు సాయంత్రం ఐదు గంటల సమయంలో లిఫ్ట్ పాడవడంతో హోటల్ యజమాని లిఫ్ట్ చూడమని చెప్పారు. దాంతో లిఫ్ట్ లో దిగి చెక్ చేస్తుండగా సడెన్‌గా లిఫ్ట్ ఆన్ అయింది. కిందికి రావడంతో మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయిన గణేష్ కిందదాకా లిఫ్టు తో పాటు రావడంతో మృతిచెందాడు . ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.