కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. అనంతరం సమావేశ వివరాలను ఎంపీ కోమటి రెడ్డి మీడియాకు వెల్లడించారు. జాతీయ రహదారికి 930P నంబరు గల జై శ్రీరామ రహదారిని కేటాయించి DPRని ఆమోదించిందని.. వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ORR జంక్షన్ గౌరెల్లి వద్ద నుండి భూధాన్ పోచంపల్లి -వలిగొండ – తిరుమలగిరి – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లందు – భద్రాచలం మీదుగా 100 కి.మీల భోంగీర్టు పార్లమెంటరీ కాన్సస్ కింద భద్రాచలం కొత్తగూడెం వద్ద NH 30 జంక్షన్ వరకు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కొత్త NH వేయడం ద్వారా వైజాగ్ పోర్ట్ నుండి ఛత్తీష్‌గఢ్ మీదుగా హైదరాబాద్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని.. తెలంగాణ రాష్ట్రంలో, ఈ NH గోదావరి నది ఒడ్డు గుండా వెళ్తుందన్నారు.
ప్రస్తుతం ఈ రహదారి చాలా ఇరుకుగా ఉండటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణికులు తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఇంకా చాలా తక్కువ భూసేకరణ మాత్రమే మిగిలి ఉందని.. వెంటనే పనులు ప్రారంభించేలా టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి ఇప్పటికే భూసేకరణ జరిగిన మేరకు టెండర్లు పిలవాలని హాజరైన అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని కూడా మంత్రి అధికారులతో మరోసారి సూచించారని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!