అదృష్టం ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కరోనా సమయంలో బయటకు వెళ్లి కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడంలేదన్నది వాస్తవం. అయితే, ఓ వ్యక్తి ఆనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న సమయంలో తన స్నేహితుడు మూడు స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. వాటిని మసాచుసెట్స్‌లో ఉంటున్న స్నేహితుతు అలెగ్జాండర్ మెక్లిష్ కు ఇచ్చాడు.
Read: జైకోవ్ డీ వ్యాక్సిన్ రెడీ… తొలుత ఆ ఏడు రాష్ట్రాల్లోనే…
సర్జరీ అనంతరం ఇంటికి వచ్చిన మెక్లిష్ మూడు స్క్రాచ్ కార్టులను స్క్రాచ్ చేయగా అందులో ఆయనకు మిలియన్ లాటరీ తగిలింది. అన్ని పన్నులు పోను మెక్లిష్ కు 4.8 కోట్ల రూపాయలు వస్తాయని నిర్వహకులు చెబుతున్నారు. ఇంట్లో కూర్చొన్న వ్యక్తికి కోట్ల రూపాయలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం అంటే అతనిదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.