విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ నెల 10న బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యకమానికి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరవుతారు. దీంతో రెండో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు రహదారుల శాఖ మంత్రి శంకరనారాయణ, అధికారులు. ఈనెల 10న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 16వేల 500 కోట్లతో 1045 కిలోమీటర్లు […]
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 కేసులు నమోదవ్వగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ముంబైలో కొత్తగా రెండు కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 10 కి చేరింది. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు […]
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి […]
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మార్చి నుండి […]
బస్సుల్లో ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. తప్పనిసరి అనుకుంటే ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారు బస్సు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సుల్లో లాంగ్ జర్నీ చేయాలంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బామ్మ టికెట్ లేకుండా ఫ్రీగా 3540 కిమీ ప్రయాణం చేసింది. 120 బస్సుల్లో ఒక్కసారి కూడా టికెట్ కొనకుండా ఫ్రీగా ప్రయాణం చేసిందట. అదెలా సాధ్యం అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్నా. ఇంగ్లాండ్‌లో […]
చాలామందికి చూయింగ్ గమ్ తినే అలవాటు వుంటుంది. యూత్‌లో ఇది మరీ ఎక్కువ. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పరిశోధకులు ఆశాజనక ఫలితాలు సాధించారు. ఇటీవల ప్రచురితం అయిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిచేస్తున్నాయి. కరోనా సోకినా వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాల ఆధారాలు చెబుతున్నాయి. అందువల్ల యూఎస్ పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్ రూపొందించారు. దీని సహాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని […]
ఒమిక్రాన్ టెన్షన్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. డెల్టా నుంచి బయటపడేలోగా ఒమిక్రాన్ వేరియంట్ ఇబ్బందులు పెడుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్లో 8 రకాల మ్యూటేషన్లు ఉంటే, ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయి. అంతేకాదు, డెల్టా వేరియంట్ వ్యాప్తి రేటు 1.47 ఉంటే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు 1.97గా ఉంది. ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది. డెల్టా విజృంభించిన సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. […]
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని […]