జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్‌తోపాటు ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజమౌళి అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి RRR ఎమోషనల్ డ్రైవ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నా.. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరినీ బిగ్ స్క్రీన్‌పై చూడటానికి వెయిట్ […]
మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో […]
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడతారో తెలియడం లేదు. వరుస దొంగతనాల కేసులతో పోలీసులు సతమతమవుతున్నారు. తాజాగా..హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దొంగలు తమ చేతివాటం చూపెట్టారు. ఏకంగా అయ్యప్ప స్వాములకే పంగ నామాలు పెట్టారు దొంగలు. స్వాముల తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ దర్గా ఖలీజ్ ఖాన్ లో అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న స్వాముల బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేల నగదు, ఓ బైకును దుండగులు దొంగిలించారు. అర్ధరాత్రి […]
ఖరగపూర్, విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ-నాగపూర్(975కి.మీ)ల మధ్య “డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్” నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ “నేషనల్ మినరల్ పాలసీ” కింద “డెడికేటెడ్ మినరల్ కారిడార్లు” ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మైనింగ్ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. “మినరల్ […]
ఓ వైపు కోవిడ్ మహమ్మారితో యుద్ధం చేస్తుంటే మరో వైపు ఇతర వ్యాధుల పెరుగుదల, మరణాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా తెలంగాణపై క్యాన్సర్ పంజా విసురుతోంది. ప్రతీ ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. 1990లో ఉమ్మడి ఏపీలో ఒక లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు […]
చైనా జెయింట్ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే దేశీయ, అంతర్జాతీయ ఈ కామర్స్ వ్యాపారాలను పునర్వవస్థీకరిస్తామని చెప్పింది. ఈ ప్రకటనతో అలీబాబా షేర్లు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా చైనా బ్యాంకులకు, ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తరువాత దాదాపు మూడు నెలల పాటు జాక్‌మా ఎవరికీ కనిపించలేదు. ఎమయ్యారో తెలియలేదు. ఆ తరువాత బయటకు వచ్చినా ఆయన పెద్దగా యాక్టీవ్‌గా కనిపించడం లేదు. […]
ఒమిక్రాన్ వేరియంట్‌పై, ప్రస్తుత కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను, వ్యాక్సినేషన్‌ను అధికారులు మంత్రి హరీష్‌రావుకు వివరించారు. Read: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి […]
మరికాసేపట్లో పెళ్లి అనగా ఏదో కారణం చేత పెళ్లిళ్లు ఆగిన సంగతులు చూశాం. నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అయితే, పెళ్లి తంతు అంతా బాగా జరుగుతున్న సమయంలో పెళ్లి మండపంలోకి మాజీ ప్రియుడు వచ్చి గలాటా చేయడం వలన పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో ఓ పెళ్లి మండపంలో వివాహం జరుగుతున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడు దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ […]
ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ తెలంగాణ వాసుల్ని భయపెడుతోంది. దీనికి తోడు కరోనా మూడో దశ ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వరంగల్ వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా ముందస్తు చర్యల పైన అధికారులు దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాలకు ఏకైక పేదల పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్ ఎంజీఎంలో మరో మారు 250 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. […]
ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు. ఘంటసాల శతజయంతి సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల ఎమోషనల్ అయ్యారు. అమరగాయకుడు ఘంటసాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దీపానికి కిరణం ఆభరణం అంటూ అనేక మధురమయిన పాటలు పాడి అందరినీ అలరించారు. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనా ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే…అధరాల మీద ఆడింది నామం కనుపాపలందే కదిలింది రూపంఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే…అంటూ పాట పాడి ఉర్రూతలూగించారు సుశీల.