డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేత విష్ణు వర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సీఎంను హత్య చేస్తారని వైసీపీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదన్నారు. Also read: రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం… సీఎం ను కాపాడుకోలేని వాళ్లు ప్రజలను ఎలా కాపాడుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు […]
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును […]
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ […]
ధాన్యం కొనుగోలు సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం సేకరణపై మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయన్నారు. గతేడాది కన్నా 30శాతం అధికంగా ఈ సారి ధాన్యం సేకరించామని తెలిపారు. ధాన్యం సేకరించిన అనంతరం రైతులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లింపునకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. opmsలో నమోదైన వెంటనే రైతులకు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.5,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. […]
రాష్ట్రంలో ధాన్యం సేకరణ కొనసాగుతుందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై ఫైర్ అయ్యారు. సిగ్గులేకుండా బీజేపీ నేతలు గవర్నర్‌ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపారన్నారు. మొహం మీద కొట్టినట్టు అంత బాగుంది అని రైతులు వారికి సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. 5,447 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. […]
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను రాష్ర్టహైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు పిటిషన్ వేయగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. […]
కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన మానవహక్కుల కార్యకర్త మణిదీప్ ఆర్టీఐ ద్వారా న్యాయమూర్తుల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర న్యాయ శాఖన్యాయశాఖ డైరెక్టర్, మొదటి అప్పీలేట్ అథారిటీ అన్వితా సిన్హా సమాధానమిస్తు గత 30 ఏళ్లలో భారతదేశంలో ఏ హైకోర్టులోను పూర్తి స్థాయి న్యాయ మూర్తులులేరని తెలిపారు. న్యాయ శాఖ ప్రకారం, జనవరి 1, 2021 నాటికి, దేశంలోని 25 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టుల్లో న్యాయమూర్తుల […]
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సంగతి తెల్సిందే. వ్యాక్సినేషన్లో భారత్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో సగానికి పైగా మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేశారు. IANS-Cvoter కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ సర్వే ప్రకారం.. జనాభాలో 98శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ 19 […]
హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మంత్రి కేటీఆర్ స్వచ్ఛ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తుందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మున్సిపాలిటీలో స్వచ్ఛ వాహనాలను ప్రారంభింస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ స్వచ్ఛతలో దేశంలోని అన్ని నగరాల కన్నా ముందు ఉందన్నారు. సీఎం కేసీఆర్ […]
ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ భవనాన్ని గ్రౌండ్+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర […]