కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన మానవహక్కుల కార్యకర్త మణిదీప్ ఆర్టీఐ ద్వారా న్యాయమూర్తుల సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర న్యాయ శాఖన్యాయశాఖ డైరెక్టర్, మొదటి అప్పీలేట్ అథారిటీ అన్వితా సిన్హా సమాధానమిస్తు గత 30 ఏళ్లలో భారతదేశంలో ఏ హైకోర్టులోను పూర్తి స్థాయి న్యాయ మూర్తులులేరని తెలిపారు. న్యాయ శాఖ ప్రకారం, జనవరి 1, 2021 నాటికి, దేశంలోని 25 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య 668గా ఉంది. 1991 నుండి న్యాయమూర్తుల ఖాళీలు పెరుగుతున్నాయని తెలిపారు. “మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు ఏ హైకోర్టు కూడా తన పూర్తి స్థాయి న్యాయమూర్తులతో పని చేయకపోవడం చాలా కలవరపెడుతోంది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 64 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, తర్వాత కలకత్తాలో 36 మరియు పంజాబ్ మరియు హర్యానాలో 35 ఖాళీలు ఉన్నాయని సమాధానమిచ్చారని మణిదీప్ తెలిపారు.
ఈ సందర్భంగా మణి దీప్ మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీలలో న్యాయమూర్తుల కొరత ఈ స్థాయిలో ఉంటే, జిల్లా మరియు మేజిస్ట్రేట్ కోర్టులలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం మానవ హక్కుల ఉల్లంఘనకు సమానమని దీనిని ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మణిదీప్ అన్నారు. నాలుగు కోట్లకు పైగా కేసులు భారతీయ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 12.3 శాతం కేసులు హెచ్‌సిల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2019, 2020 మధ్య ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, HCలలో పెండింగ్ కేసులు 20 శాతం పెరిగాయి. కేసుల పరిష్కారంలో జాప్యం కారణంగా అణగారిన వర్గాలకు చెందిన మూడు లక్షల మంది విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారని మణిదీప్ వెల్లడించారు.
దాదాపు 1.5 లక్షల మంది ఏడాదికి పైగా జైలులో ఉన్నారు మరియు మరో 5,000 మంది ఐదేళ్లకు పైగా జైళ్లలో ఉన్నారు. చాలా సార్లు అండర్ ట్రయల్ ఖైదీలను తప్పుగా బుక్ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయమూర్తులను నియమించాలి. దేశంలోని చాలా కోర్టుల్లో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ఇలాంటి సౌకర్యాల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మణిదీప్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల నుంచి ప్రజలు అఫిడవిట్ తీసుకోవాలని, న్యాయవ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని, అమాయక అండర్‌ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయసేవలు అందించాలని న్యాయవాదులకు మణిదీప్ విజ్ఞప్తి చేశారు.