తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీబిజీగా వున్నారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శివరాసు, […]
యువత రాణిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు వెస్ట్ బెంగాల్ డీజీపీ BN రమేష్. విశాఖలో పర్యటిస్తున్న రమేష్ నగరంలో పలు విద్యా సంస్థలను సందర్శించి విద్యార్ధులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల్లో దేశ భక్తి పెంపొందింప చేసేలా ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యువత, విద్యార్థులు దేశానికి వెన్నెముక వంటి వారన్నారు రమేష్. విద్యార్థి దశ చాలా కీలకం అన్నారు. ప్రతీ ఒక్కరు దేశ సేవలో పాల్గొనాలని, దేశరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. దేశ […]
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తం చుట్టేసింది. అత్యంత వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. సౌతాఫ్రికాలో మొదలైనప్పటికీ ఈ వేరియంట్ కేసులు యూరప్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే సుమారు మూడు వేలకు పైగా కేసులు బ్రిటన్‌లో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. క్రమంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. Read: […]
కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది శ్రావణ్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల 30 నుంచి 40వేల […]
నిత్యం ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే సీపీఎం నేత మధుకి చేదు అనుభవం ఎదురైంది. రాయలసీమ ప్రజా సంఘాల నేతల ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. అయితే, మధు ప్రసంగానికి అడ్డు తగిలారు రాయలసీమ ప్రజా సంఘాల నాయకులు. అమరావతి రైతులకు మద్దతు ఇస్తూ రాయలసీమ ఉద్యమానికి ఎలా మద్దతు పలుకుతారంటూ మధుని ప్రశ్నించారు రాయల సీమ ప్రజా సంఘాల ప్రతినిధులు. ఈ నేపథ్యంలో మధుతో వాగ్వాదానికి దిగారు సీమ ప్రజా సంఘాల నాయకులు. దీంతో […]
వన్ చైనా పాలసీలో భాగంగా ఎప్పటికైనా తైవాన్ను తన సొంతం చేసుకోవాలని డ్రాగన్ చూస్తున్నది. ఆ దిశగానే పావులు కదుపుతూ, తైవాన్‌తో దోస్తీ కట్టిన దేశాలను నయానో భయనో ఒప్పించి ఆ దేశం నుంచి బయటకు పంపిస్తోంది. 2025 నాటికి తైవాన్ను తన దేశంలో కలిపేసుకోవాలన్నది చైనా లక్ష్యం. అయితే, దీనికి అమెరికా అడ్డుపడుతున్నది. తైవాన్‌పై డ్రాగన్ ఎలాంటి సైనికచర్యలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని, తైవాన్ తరపున పోరాటం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, […]
స్వంత పార్టీకి చెందిన నేతపైనే అదే పార్టీకి చెందిన మహిళా నేత పంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి ప్రెస్ మీట్ పెట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు లీలావతి. నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై ,నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగిరమేష్ కొంతమంది వ్యక్తులు చేత […]
నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు. సన్న వడ్లు పండించిన వారికి ఐదు […]
తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్‌సభలో ఈరోజు జీరో అవర్‌లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం […]