సంచలనం కలిగిస్తున్న శిల్ప చౌదరి కేసులో రోజుకో కొత్త కథ బయటకు వస్తోంది. శిల్ప చౌదరి హై ఫై లైఫ్ ను ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. సంపన్నుల దగ్గర్నుంచి వడ్డీ రూపంలో డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది శిల్ప. దివినోస్ క్లబ్ పేరుతో కిట్టి పార్టీలను ఏర్పాటు చేసిన శిల్ప వీఐపీలను ఆకట్టుకుంది. వారిని బుట్టలో పడేసుకుంది. కిట్టి పార్టీలకు హీరో హీరోయిన్లను ఆహ్వానించేవారు శిల్ప.
సంపన్నులను ప్రసన్నం చేసుకున్న శిల్ప దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ముఖ్య అతిథిగా పిలిచింది శిల్ప. హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఫలక్ నుమా ప్యాలెస్ లో క్లబ్బు ఉత్సవాలు నిర్వహించారు. క్లబ్బు ఉత్సవాల సందర్భంగా హైఫై పార్టీని ఏర్పాటు చేసింది శిల్ప. శిల్ప ఏర్పాటు చేసిన పార్టీకి 200 మంది వీఐపీలకు చెందిన భార్యలు హాజరయ్యారు.
పార్టీలో క్యాట్ వాక్ తో పాటు హై పై పార్టీ లు ఏర్పాటుచేసింది శిల్ప. ఫలక్ నుమాలో రెండు రోజులపాటు సెలబ్రేషన్ నిర్వహించింది శిల్ప. తన పార్టనర్ తో కలిపి పెద్దఎత్తున పార్టీ నిర్వహించి వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిల్ప ఏర్పాటు చేసిన పార్టీకి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎస్‌వోటీ కార్యాలయం నుండి కోకాపేట యాక్సిస్ బ్యాంక్ కి తీసుకెళ్లిన నార్సింగి పోలీసులు ఆమె సమక్షంలో బ్యాంక్ అకౌంట్ల లాకర్లను తీసి వాటి గురించి కూపీ లాగుతున్నారు.