హైదరాబాద్ మాదాపూర్ లోని కారు గ్యారేజ్ లో జరిగిన చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.55 లక్షలు రికవరీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలక్ష్మీ మోటార్స్ కార్ గ్యారేజ్ లో ఈ నెల 9 న దొంగతనం జరిగింది.శ్రీ మోటార్స్ కారు సర్వీసు వర్క్ షాప్ లో ఉన్న 55 లక్షల నగదును దోచుకెళ్ళారు.
కారు షో రూమ్లో మెకానిక్ గా పని చేసే వ్యక్తే ప్రధాన సూత్రధారిగా తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాల కంట కనబడకుండా దొంగతనానికి పాల్పడ్డారు. మరో నూతన షో రూమ్ ఏర్పాటు కోసం ఓనర్ శ్రీకాంత్ రెడ్డి డబ్బులు షోరూమ్ లో దాచిపెట్టాడు. డబ్బు షోరూమ్ లో ఉందని గమనించిన ఉద్యోగి తాహెర్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం వేసాడు. ఇద్దరి స్నేహితులు జావీద్, సాహీబ్ లను షో రూమ్ కు పంపించి డబ్బు కొట్టేశారు.