కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్ రూపంలో మరో వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. తాజాగా బ్రిటన్‌లో మునుపెన్నడు లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ మొదలైన నాటి నుండి బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు […]
ఎంత జాగ్రత్తగా ఉన్న రోజుకో పద్ధతితో మోసాలకు పాల్పడే వారు అదే పనిగా తమ చేతి వాటం చూపిస్తున్నారు.. ఇటీవల కాలంలో ఈ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సీటీలో నకిలీ సెంకడ్ ఛానల్ బ్యాంకు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతోఈ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెకెండ్ ఛానల్ ముసుగులో పలువురు వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుని, బాధితులకు మంచి ట్రేడ్ ప్రాఫిట్ […]
సంగారెడ్డిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార […]
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశనగ పరిశోధన కేంద్రం, కర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 20న సోమవారం జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. జనగామలో కూడా […]
ఆదిలాబాద్‌లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.దట్టమైన మంచు పొగ మంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో […]
కోల్కత్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువ చేసే 5.7 కేజీల బంగారంతో పాటు ఓ ఖరీదైన ఐ ఫోన్‌ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. ఫ్లై దుబాయ్ విమానం క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ అక్రమ బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు. విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల కదలికలు పసిగట్టిన కేటుగాళ్లు దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన బంగారాన్ని విమానం క్యాబిన్ లో వదిలి వెళ్లారు.కేసు నమోదు చేసి దర్యాప్తు […]
విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతుంది. సాధారణ స్థాయి కన్నా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్‌కు టెంపరేచర్లు పరిమితమై ప్రజలను వణికిస్తున్నాయి. మినుములురు కాఫీ ఎస్టేట్ లో 09, పాడేరు 10, అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే అని చెబుతున్నారు నిపుణులు. తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి. ఉదయంపూట ప్రజలు పనులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజల […]
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. అయితే ప్రయాణికులంతా బస్సులో నుంచి వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుంది గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి […]
బీరును దేనితో తయారు చేస్తారు అంటే బార్లీ గింజలతో తయారు చేస్తారని చెప్తారు. అలా తయారు చేసిన బీరుకు డిమాండ్ ఉంటుంది. అయితే, ఆ దేశంలో తయారు చేసే బీరు మాత్రం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. బీరును మామూలు వాటితో కాకుండా బొద్దింకలతో తయారు చేస్తారట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. బొద్దింకలను ఉడకబెట్టి, వాటినుంచి రసం తీసి, ఆ రసంతో తయారు చేసిన బీరును తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బీరుకు ఆ దేశంలో […]
పెళ్లి అనేది ఒక మధురానుభూతి. పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. బాజాలు భజంత్రీలతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని అనుకుంటారు. దీనికోసం పెద్ద ఉత్సవం మాదిరిగా చేస్తారు. గుజరాత్లో పెళ్లిళ్ల సమయంలో బరాత్ ను నిర్వహిస్తుంటారు. పెళ్లి కుమారుడిని గుర్రపుబండిలో కూర్చోపెట్టి ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి పెళ్లి రోజు అనుకోకుండా ఓ విషాదం చోటుచేసుకుంది. Read: ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది… పెళ్లికొడుకును ఊరేగింపుగా […]