తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసులపై స్పందించారు. ఒమిక్రాన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు నగర పోలీస్ కమిషనర్. ఇతర దేశాల నుండి వచ్చేవారు టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే బయటకి రావాలన్నారు. ఒమిక్రాన్ గురించి భయపడాల్సింది లేదు. ఒమిక్రాన్ వచ్చిన వారికి గచ్చిబౌలి లోని టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తారన్నారు.
బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు, వారితో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్ లు చేయించుకోవాలన్నారు. వారు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒమిక్రాన్ పాజిటివ్ అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌తో తప్పిపోయిన సోమాలియన్‌ను కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నారన్నారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. ఒమిక్రాన్ పాజిటివ్ అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌తో తప్పిపోయిన సోమాలియన్‌ను అతనితో ఐ కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు పారా మౌంట్ కాలనీలో టెస్టులు చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఒమిక్రాన్ వచ్చిన వ్యక్తిని టిమ్స్‌కి తరలించిన సంగతి తెలిసిందే. తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చాడా యువకుడు. వైద్యం కోసం అపోలో, యశోద ఆస్పత్రులకు వెళ్ళారు ఆ తండ్రీ కొడుకులు. తండ్రి శ్యాoపిల్స్ తీసుకుని జినోమ్ సీక్వెన్సీకి పంపారు వైద్యులు.