21వ శతాబ్దంలో దెయ్యాలు ఉన్నాయనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నిత్యం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది. అలాంటి సంఘటన ఒకటి ఇటీవలే యూకేలోని విల్డ్‌షైర్‌లో ఉన్న లాంగ్ ఆర్మ్ బార్‌లో జరిగింది. ఓ కస్టమర్ కౌంటర్ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ బార్ సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఇంతలో కౌంటర్ డెస్క్‌లోని ఓ గ్లాస్ దానంతట అదే కిందపడి పగిలిపోయింది. మిగతా గ్లాసులన్నీ అలానే ఉన్నాయి.
Read: 25 సంవత్సరాల శ్రమ… 75 వేల కోట్లు ఖర్చు… సవ్యంగా చేరితే…
ఎవరూ కూడా ఆ డెస్క్‌ను కదిలించలేదు. ముట్టుకోలేదు. కాని గ్లాస్ కిందపడి పగిలిపోయింది. కస్టమర్‌కు అనుమానం వచ్చి చేతిని కౌంటర్ ముందు ఉంచి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరూ పడేయకుండా లోపల ఉన్నగ్లాస్ దానంతట అదే కిందపడి పగిలిపోవడంతో బార్‌లో దెయ్యం ఉందనే వార్తలు వచ్చాయి. గతంలో కూడా ఈ బార్ లో ఇలాంటి ఘటనలు జరిగాయని సిబ్బంది చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
So #George our resident ghost👻 is playing up tonight, keep watching the bottom shelf👻😬👻👻👻👻👻 pic.twitter.com/PnoWqwMvjY
— The Longs Arms (@TheLongsArms) December 4, 2021