విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతుంది. సాధారణ స్థాయి కన్నా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్‌కు టెంపరేచర్‌లు పరిమితమై ప్రజలను వణికిస్తున్నాయి. మినుములురు కాఫీ ఎస్టేట్ లో 09, పాడేరు 10, అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే అని చెబుతున్నారు నిపుణులు. తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి.
ఉదయంపూట ప్రజలు పనులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ప్రజల రోజువారీ కార్యక్రమాలకు అంతారాయం కలుగుతుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.