బీరును దేనితో తయారు చేస్తారు అంటే బార్లీ గింజలతో తయారు చేస్తారని చెప్తారు. అలా తయారు చేసిన బీరుకు డిమాండ్ ఉంటుంది. అయితే, ఆ దేశంలో తయారు చేసే బీరు మాత్రం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. బీరును మామూలు వాటితో కాకుండా బొద్దింకలతో తయారు చేస్తారట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. బొద్దింకలను ఉడకబెట్టి, వాటినుంచి రసం తీసి, ఆ రసంతో తయారు చేసిన బీరును తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బీరుకు ఆ దేశంలో యమా డిమాండ్ ఉన్నది.
Read: పెళ్లి ఊరేగింపులో అపశృతి: గుర్రపు బోగీలో మంటలు… క్షణాల వ్యవధిలో…
ఇలా స్పెషల్‌గా తయారు చేసే బీర్ కావాలంటే జపాన్ వరకు వెళ్లాల్సిందే. ఈ బీర్ కోసం తైవాన్ నుంచి మగ బొద్దింకలను తెప్పిస్తారట. ఇలాంటి బొద్దింకలు నీళ్లల్లో ఉండే కీటకాలను, చిన్న చిన్న చేపలను తిని జీవనం సాగిస్తుంటాయి. ఆ బొద్దింకలను కొన్ని రోజుల పాటు నీళ్లల్లో ఉడికిస్తారు. అలా ఉడికించగా వచ్చిన రసంతో కబుటోకామా అనే జపాన్ ప్రాసేస్‌తో బీరును తయారు చేస్తారు. ఈబీరుకు జపాన్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారని వారి నమ్మకం.