NTV WebDesk
Author- NTV Telugu-
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కీలక భేటీ…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. దాదాపు గంటసేపు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఏర్పాటు చేయాలనుకున్న జాతీయ రహదారికి సంబంధించిన డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, ఈ రహదారి నిర్మాణం ద్వారా విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్గడ్ […] -
ఆ దేశ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత… వైద్యం చేయవద్దంటున్న నెటిజన్లు…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్రెజిల్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది. ప్రజలు మాస్క్ పెట్టుకోనవసరం లేదని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సోనారో చెప్పడంతో మాస్క్ పెట్టుకోకుండా తిరిగారు. దీంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేసింది. ఆ సమయంలో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మంది చనిపోయారు. చేతులు కాలాక అకులు పట్టుకున్న చందాన, కరోనా మహమ్మారి విజృంభణ తరువాత మాస్క్ తప్పనిసరి చేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్పటి నుంచి అధ్యక్షుడు […] -
ఆ నగర జనాభా 1.2 మిలియన్లు… 3 కరోనా కేసులు రావడంతో…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కరోనా కేసులు, కొత్త వేరియంట్ కేసులు ఎన్ని ఉన్నాయో ఆ దేశం స్పష్టంగా బయటపెట్టడం లేదు. రెండు మూడు కేసులు బయటపడినా నగరాలను లాక్ డౌన్ చేస్తున్నది. తాజాగా యుజ్హౌ నగరంలో లాక్ డౌన్‌ను విధించారు. 1.2 మిలియన్ జనాభా కలిగిన యుజ్హౌ నగరంలో బయటపడింది కేవలం 3 కరోనా […] -
శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్…
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో […] -
సముద్రంలో అమ్మకానికి చిన్న మేడ… ధర ఎంతో తెలిస్తే షాక్…
ఏకాంతంగా నివశించాలని చాలా మంది కోరుకుంటారు. ఎలాంటి రణగొన ధ్వనులు లేకుండా, కాలుష్యం లేకుండా హ్యాపీగా జీవనం సాగించాలని చాలా మంది అనుకుంటారు. ఇలా అనుకునేవారు పల్లెలు, కొండ ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అయితే, అక్కడ కూడా చాలా మందికి ప్రశాంతత లభించకపోవచ్చు. ఎందుకంటే, ఎక్కడైనా సరే చుట్టూ మనుషులు కనిపిస్తుంటారు. అలా చుట్టూ మనుషులు లేకుండా నివశించాలి అంటే ఒకటి అడవిలో దూరంగా నివశించడం, లేదా సముద్రంలో ఎవరూ లేని దీవిలో ఒంటరిగా నివశించడం. […] -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా…
దేశంలో కరోనా మహమ్మారి వణికిస్తున్నది. రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్టు కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని అన్నారు. త్వరలోనే కోలుకొని తిరిగి బయటకు వస్తానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశరాజధాని ఢిల్లీలో రోజువారి కేసులు […] -
ఢిల్లీని వణికిస్తున్న కొత్త వేరియంట్…
ఢిల్లీలో రోజు రోజుకు కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటుగా విద్యాసంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు, జిమ్, స్పాలు మూసివేశారు. 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, మెట్రోలు కొనసాగుతున్నాయి. ఇక, కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తున్నాయి. జనవరి 3 వ తేదీన 4099 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పాజిటివిటీ రేటు 6.46శాతంగా ఉన్నది. Read: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు […] -
క్రూజ్ నౌకలో కరోనా కలకలం… ఆందోళనలో 2000 మంది ప్రయాణికులు…
దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు గోవా వెళ్లారు. నూతన సంవత్సర వేడుకల తరువాత ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముంబై పోర్ట్ నుంచి గోవాకు కార్డెలియా క్రూజ్ షిప్ వెళ్లింది. అయితే, 2000 మంది టూరిస్టులతో బయలుదేరిన […] -
జనవరి 4, మంగళవారం దినఫలాలు
మేషం :- పందేలు, జూదాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవసేవాకార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు పని ఒత్తిడి, ఊహించని […] -
ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది: కేసీఆర్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో […]
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!