అనగనగా ఓ బిచ్చగాడు. వీధులెంట, ఇళ్లవెంట తిరిగి భిక్షమెత్తుకొని చాలా డబ్బు సంపాదించాడు. అలా సంపాదించిన డబ్బును ఓరోజు ఉజ్జయిని లోని నాగదా రైల్వే స్టేషన్ బయట మెట్లపై కూర్చోని సంచిలో నుంచి డబ్బులు తీసి బయటకు విసరడం ప్రారంభించాడు. బిచ్చగాడు చేసిన పనికి అక్కడున్న ప్రయాణికులంతా షాక్ అయ్యారు. వద్దు విసరొద్దు అని చెప్పినా వినలేదు. రూ.10, రూ. 20, రూ. 50 నోట్లను సంచిలోనుంచి తీసి విసరసాగాడు.
Read: పంజాబ్‌లో ఎస్ 400 మోహరింపు…
అయితే, బిచ్చగాడు విసిరేసిన అ డబ్బును ఎవరూ తీసుకోలేదు. విషయాన్ని రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు ప్రయాణికులు. వెంటనే పోలీసులు వచ్చి అ వ్యక్తిని, డబ్బును తీసుకొని వెళ్లారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని, అందుకే అలా చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
उज्जैन से 55 किमी दूर नागदा रेलवे स्टेशन पर यात्रियों के उस वक्त होश उड़ गए, जब एक भिखारी ने नोटों की बारिश कर दी. pic.twitter.com/Ksyow43ZG0
— chaturesh tiwari (@ChatureshMedia) December 15, 2021