హైదరాబాద్ గోషామహల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోషామహల్ లోని జింగుర్ బస్తీలో ఒక సెంట్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, సహాయక చర్యలు చేపట్టారు మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ ముకేష్ సింగ్. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. […]
దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) ముఠా సభ్యలను వరంగల్ టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్టాప్లు, […]
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సినియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి ఖచ్చితంగా జాబితాను రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం డీయస్ఈ శ్రీదేవసేన తన కార్యాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాత్రి 12.00గంటలకు […]
రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహ్వానం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సి. పార్థసారధి చండీగఢ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే, SEC అనుసరించే వినూత్న చర్యలు మరియు ఉత్తమ పద్ధతులను […]
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై […]
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నేటికి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రతీ విచారణకు మినహాయింపు కోరుతున్నారని సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది సీబీఐ కోర్టు. కోర్టుకు రాకుండా హాజరు మినహాయింపుపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామన్నారు జగన్ తరఫు న్యాయవాది. హాజరు మినహాయింపుపై హైకోర్టులో తీర్పు రావల్సి ఉందని న్యాయవాది తెలిపారు. హైకోర్టు తీర్పు […]
ఏపీలో థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా విజయనగరం జిల్లాలో మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. నిబంధనలను పాటించని సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ కొరడా ఝుళిపించారు. మూడు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్ను ఆదేశించారు. పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి, సినిమా థియేటర్లను ఆయన […]
పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా సేవలందిస్తున్న హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఇయర్ కానుకగా రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని పెంచనున్నట్టు ప్రకటించింది. హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు 2021, జూన్ నుంచి అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు హోం […]
మరోసారి తెలుగుతమ్ముళ్లపై తీవ్ర స్థాయిలో కొడాలినాని విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ పై ధ్వజమెత్తారు. ఎవ్వరరూ ఏమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆయన వెల్లడించారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ చేపట్టామని ఆయన అన్నారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. అమరావతి కూడా ఉంటుందని నాని వ్యాఖ్యానించారు. కేవలం […]
కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం […]