రిషికొండలో నిర్మాణాలకు బ్రేక్ … ఎన్జీటీ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై అక్రమ నిర్మాణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, CPCB, రాష్ట్రానికి చెందిన స్వతంత్ర నలుగురు సభ్యుల కమిటీని నియమించిందని తెలిపింది. దీనిపై PCB, SEIAA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా మేజిస్ర్టేట్‌ను నివేదిక కోరింది. రెండు నెలల్లో ట్రిబ్యూనల్‌కు ఈ నివేదికను అందజేయాలని ఆదేశించింది. స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (SEIAA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. ఈ కమిటీ రెండు వారాల్లో సమావేశం కావొచ్చని తెలిపింది.
అంతేకాకుండా ఈ కమిటీ సభ్యలు రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించవచ్చని , దానికి సంబంధించిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఈ కమిటీలకు ఉందని ఎన్జీటీ బెంచ్ పేర్కొంది. రఘురామ రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి ప్రాంతాల (అభివృద్ధి) చట్టం 1975 ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్‌ను ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది. అయితే పిటిషన్ దారు ఈ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని, పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నట్టు ఎన్జీటీ తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..