తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ […]
ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. జీవోల్లో ఐదు శాతమే సైట్లో ఉంచుతున్నారని న్యాయవాది బాలాజీ తెలిపారు. కాగా ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే కొన్ని రహస్య జీవోలే అప్లోడ్ చేయడం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా అన్ని జీవోల వివరాలను వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని […]
ఒమిక్రాన్ కేసులు ప్రపంచంలో తీవ్రంగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రపంచం యావత్తు అతలాకుతలం అవుతున్నది. ఒమిక్రాన్‌పై ఇటీవలే బిల్‌గేట్స్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. ఒమిక్రాన్ కేసులు భారీగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. దీంతో బిల్‌గేట్స్ తన ప్రకటనపై యుటర్న్ టీసుకున్నారు. ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుంటుందని, రానున్న రోజులు […]
తెలంగాణలో రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం నాటకలాడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ అనుబంధ సంఘాలన్నిటితో సమావేశం జరిగిందని, ఈ రోజు డిజిటల్ మెంబర్షిప్ తో పాటు భూ వివాదాలపై పాదయాత్ర పై చర్చించాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు పాదయాత్ర జరగనుంది. జనవరి 30 నుంచి పాదయాత్ర ను మీనాక్షి నటరాజన్ చేయనున్నారు. ఈ పాదయాత్ర లో ఒక్క రోజు […]
ఓటీఎస్ అమలు చట్ట విరుద్దమన్నారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. చట్ట ప్రకారం ఇప్పటికే హక్కులు సంక్రమించిన ఇళ్లకూ ఓటీఎస్ అమలు చేసి దోచుకుంటున్నారని యనమల మండిపడ్డారు. అప్పులు పుట్టకే ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో నాటకం ఆడుతోంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పేదల ఇళ్లకు 12 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయి. వాస్తవాలను మరుగునపెట్టి సెటిల్ మెంట్ చేస్తామనడం పేదప్రజలను మోసగించడమే.ఓటిఎస్ పేరుతో పేదల నుంచి రూ.5 వేల కోట్లు దోచుకునేందుకు మాస్టర్ […]
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు. […]
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్పూర్ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు […]
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమే జగన్ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో అనేక సమష్యలు ఉన్నాయి.రాష్ర్ట సమష్యల పరిష్కారం కోసం కేంద్రానికి సహకరిస్తూ ముందుకు వెళుతున్నాం అన్నారు ధర్మాన. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజా సంక్షేమమే సిఎం జగన్ లక్ష్యం అన్నారు. సంపూర్ణగృహ హక్కు గతంలో లేదు. ఎన్నో ఆలోచించి ఈ పథకం తెచ్చాం. ప్రతి ఒక్కరికీ నామినల్ వ్యయంతో నివాసానికి రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం. ఓటిఎస్ […]
మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను….’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సుబ్బారావు గుప్తాపై దాడిచేసిన సుభానీపై పోలీసులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. సుబ్బారావు గుప్తాపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత సుభానీని వన్ టౌన్ పోలీసులు […]
ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం అధినేత, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడారు. శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెబుతుంటే, సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైసీపీ ఉందన్నారు. తోటి వారిని ప్రేమించాలనే బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభువు ఆమోదిస్తారా? ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని ఎద్దేవా […]