హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. కోకాపేట్ నియో పోలీస్ లోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 239, 240 సర్వే నంబర్ల లోని భూమి పై హక్కులు పూర్తి గా ప్రభుత్వానివేనని నిర్ధారణ అయింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఏజెంట్ గా హెచ్ ఎండీఏ ఈ భూముల వేలం నిర్వహించనున్నది. వేలంలో.. భూములు కొన్న బిల్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి.. కలెక్టరెట్కు […]
ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి […]
ఇప్పటికే కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ఒమిక్రాన్, డెల్టా వేరింయంట్ల రూపంలో టెన్షన్ పెడుతుంటే మరోవైపు తెలంగాణలో కొత్త వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్ర్కబ్ టైఫస్ అనే వ్యాధి బారిన పడ్డవారు ఏకంగా 15మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారని ఇప్పటికే ఇద్దరికి వ్యాధి నయమైందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారుల్లో కనిపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధికి సంబంధించి […]
యూపీలో ఎన్నికల వేడి రగులుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా […]
పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ కట్టడం సిగ్గు చేటని, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు బీజేపీ నాయకులతో పాటు, అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, నేడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం […]
ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర […]
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా అంతం కాలేదు. కొత్తగా రూపం మార్చుకొని విజృంభిస్తూనే ఉన్నది. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు హెపరిన్ అనే ముక్కుద్వారా తీసుకునే ఔషదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెపరిన్ను రక్తాన్ని పలుచగా మార్చేందుకు మెడిసిన్గా వినియోగిస్తారు. హెపరిన్ చౌకగా దొరికే ఔషదం. దీనిని ముక్కులో […]
దేశంలోనే అత్యంత మౌలిక సదుపాయాలను అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కోవిడ్ సమయంలో సైతం ప్రతీ పేద వాడిని ఆదుకున్నాం అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యాలకు గురైన విద్యా, వైద్యంలో సమూల మార్పులు చేసాం. ప్రతీ పార్లమెంట్ కి ఓ మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబుకు ప్రజల బాగోగులు అవసరంలేదు.. కేవలం పదవీ కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి. ఎందుకు ఇంటి లోన్లు ఉచితంగా ఇవ్వలేదన్నారు. […]
1 తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అమిత్ షా నోట ముందస్తు ఎన్నికల మాట 2 ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. […]
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో మూడో రోజు కొనసాగుతున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలు ఇంటింటికి చేరుతున్నాయన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే సమస్యలపై వచ్చే దరఖాస్తులు 90శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడు వేయలేదని మంత్రి తెలిపారు. నీళ్లు, […]