మధుకాన్ డైరెక్టర్ శ్రీనివాస్ రావుని అరెస్ట్ చేసిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్‌ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్‌పూర్‌ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఎన్‌హెచ్ 33 నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో 2011లో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తొలుత రాంచీ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఒ) మొత్తం రూ.264 కోట్ల్ల నిధుల మళ్లింపు జరిగినట్లు తేల్చింది.
తాజాగా ఈ కేసులో మధుకాన్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరిట బ్యాంకు రుణాలు మళ్లించారని అభియోగాలను అధికారులు పేర్కొన్నారు. అయితే శ్రీనివాసరావు అరెస్టు తీరును తప్పు పట్టిన నాంపల్లి ఈడీ కోర్టు. సీఆర్ పీసీ 41ఏ ప్రకారం ఈడీ వ్యవహరించలేదని కోర్టు ఈడీ అధికారులను తప్పు పట్టింది. శ్రీనివాసరావుకు రిమాండ్ విధించేందుకు నిరాకరించిన ఈడీ కోర్టు. ఈడీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సవాల్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆర్థిక లావాదేవిలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!