తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ సహా పలు సెట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఇక, ఇవాళ టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.. ఆగస్టులో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుండగా.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 24వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రవేశ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 24 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చిన పేర్కొంది ఉన్నత విద్యామండలి.. ఇక, లేట్ ఫీతో జులై […]
తెలంగాణ మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. మేఘా భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతంతో గాయత్రి పంపింగ్ కేంద్రంలో మరో రికార్డ్ నమోదయింది. అనతికాలంలోనే భూగర్భ అద్భుతం గాయత్రి పంప్ హైస్ నుండి 100 టిఎంసీల ఎత్తిపోత ప్రారంభం అయింది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఆగష్టు 8, 2019లో గాయత్రి పంప్ హౌస్ ను మేఘా ప్రారంభించింది. అత్యధికంగా 1703 […]
దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. దీంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ […]
కరీంనగర్ పేలుడు కేసుతో పాతబస్తీకి లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో పాతబస్తీ అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 1000 కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు […]
ఘట్ కేసర్ బీ-ఫార్మసీ విద్యార్థిని నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కానీ ఇంకా కూడా ఆత్మహత్యపై క్లారిటీ రాలేదు. అందుకే అనుమానస్పద మృతి గానే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య… కాదా అన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తర్వాతనే తేలనుంది. చనిపోవడానికి కారణాలేంటో స్పష్టతకు రాలేకపోతున్నారు విద్యార్ధిని తల్లిదండ్రులు. అయితే ఈ నెల 23న ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని గాంధీ హాస్పిటల్ కి తీసుకు […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. “వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించాడు. జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసాడు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించాడు. గుండె దిటవు చేసుకో చంద్రబాబూ. జరగబోయే […]
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికభాగం వైసీపి కైవసం చేసుకున్నది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పం నియోజక వర్గంలోని కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. దిశానిర్దేశం చేసేందుకు బాబు పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు […]
మార్చి 10 వ తేదీన రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. విజయవాడలో రైల్వేకు సంబంధించి ఆక్రమిత భూ బదలాయింపుకు సంబంధించి వైఎస్ జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాసారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో 800 కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాయి. పేదలు ఆక్రమించిన భూమి క్రమబద్దీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైల్వే శాఖకు ఉపయోగంలో లేని […]
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీం ఇండియా పట్టుబిగిస్తోన్నట్లే కనిపిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 99 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ 57 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. మరో ఓపెనర్ గిల్ 11 పరుగులు, టెస్టు స్పెషలిస్టు పుజారా డకౌట్ అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లి 27 పరుగులు చేసి లీచ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి రోజు ఆటముగిసే సరికి క్రీజులో […]
ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. తమతో కలవకుండా వీఆర్వోలను కొన్ని ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ ఏపీ జేఏసీ అమరావతి సంఘం ఛైర్మన్ బొప్పరాజు విమర్శలు గుప్పించారు. పరోక్షంగా ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి పై బొప్పరాజు ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ… వీఆర్వో సంఘాలు మా ఏపీ జేఏసీతో కలవడం కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకి ఇష్టం లేదు. అందుకే వీఆర్వో సంఘాల నేతలపై బెదిరింపులకి పాల్పడుతున్నారు. వీఆర్వోల పై ఏసీబీతో దాడులు […]