కరీంనగర్ పేలుడు కేసుతో పాతబస్తీకి లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో పాతబస్తీ అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 1000 కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా కరీంనగర్ & ఖమ్మం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు డిటోనేటర్ పేలుడు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ & సిటీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శ్రీరామ, హెచ్ఎంటి ట్రాన్స్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టగా డిటోనేటర్ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అయితే నిందితుల పై కురుసులు నమోదుచేసి విచారిస్తున్నారు హైదరాబాద్, కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.