ఘట్ కేసర్ బీ-ఫార్మసీ విద్యార్థిని నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కానీ ఇంకా కూడా ఆత్మహత్యపై క్లారిటీ రాలేదు. అందుకే అనుమానస్పద మృతి గానే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య… కాదా అన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తర్వాతనే తేలనుంది. చనిపోవడానికి కారణాలేంటో స్పష్టతకు రాలేకపోతున్నారు విద్యార్ధిని తల్లిదండ్రులు. అయితే ఈ నెల 23న ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని గాంధీ హాస్పిటల్ కి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. యువతికి గాంధీ ఆస్పత్రి వైద్యులు ట్రీట్ మెంట్ ఇచ్చి… ఆరోజు సాయంత్రం ఇంటింకి పంపించారు. అయితే వారం రోజులుగా యువతి తీవ్ర మనస్తాపంతో ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఇక ముగిసిన పోస్టుమార్టం ప్రాధమిక నివేదకలోను మృతిపై స్పష్టత రాలేదు.