తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ సహా పలు సెట్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఇక, ఇవాళ టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.. ఆగస్టులో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుండగా.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 24వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రవేశ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 24 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చిన పేర్కొంది ఉన్నత విద్యామండలి.. ఇక, లేట్ ఫీతో జులై 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. జులై 20వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఆగస్టులో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని.. లాసెట్, పీజీఎల్ సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ జీబిరెడ్డిని నియమించినట్టు పేర్కొంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.