నాగ్‌పూర్: అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ బంధువులు నాగ్‌పూర్‌లో నివశిస్తున్నారు. అది కూడా ఒకటి, రెండేళ్ల నుంచి కాదు. ఏకంగా రెండు శతాబ్దాల నుంచి. జో బిడెన్ ముది ముత్తాతల నాటి నుంచీ వీరికి చుట్టరికం ఉంది. ఈ విషయం గురించే 1981లో వీరు జో బిడెన్‌కు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో నాగ్‌పూర్‌లోని ఈ ఫ్యామిలీ తెరమీదకొచ్చింది. తాము భారత్‌లో 1873 నుంచి నివశిస్తున్నామని, ముంబైలో కూడా బంధువులు ఉన్నారని […]
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న […]
కరోనా సమయంలో ఫేస్ మాస్క్ లు తప్పనిసరి అయ్యింది. మాములుగా మెడికేటెడ్ మాస్క్ లతో పాటుగా గుడ్డతో తయారు చేసిన వివిధ రకాల మాస్కులు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల డిజైన్స్ తో కూడిన మాస్క్ లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇంగ్లాండ్ లోని స్వింటన్ నుంచి మాంచెస్టర్ కు వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు వెరైటీ మాస్క్ ధరించి బస్సు లో ప్రయాణం చేస్తున్నాడు. పాము చర్మంతో తయారు చేసిన మాస్క్ లా ఉండటంతో వెరైటీ గా ఉందని అనుకున్నారు. కాసేపటి తరువాత […]
కరోనా సమయంలో దేశంలో లక్షలాది మంది ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర ఇప్పటికే ఆడుకున్నాయి. అయితే, కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయినవారికి నిరుద్యోగ భృతిని కల్పించేందుకు సిద్ధం అయ్యింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం కింద నిరుద్యోగ భృతి కల్పించబోతున్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇది అమలులో […]
దేశంలో బంగారం ధరలు అదుపులోనే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో భారీ స్థాయిలో ధరలు ఉండగా, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దాదాపుగా 11 వేలకు పైగా బంగారం తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ. 43,750కి చేరింది. 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కి […]
అధికారంలో ఉంటే అన్నీ కాళ్ల దగ్గరకు వస్తాయని అనుకుంటారు. అందులోనూ మంత్రిగా ఉంటే ఇక చెప్పేది ఏముంది? కానీ.. ఆ మంత్రి మాత్రం డిఫరెంట్‌గా ఆలోచించారో ఏమో… భూమి హక్కుకోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా భూమి కథా? సీఎస్ ఇతర అధికారులు ప్రతివాదులుగా హైకోర్టులో మంత్రి గంగుల పిటిషన్! తెలంగాణ ప్రభుత్వం భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా సంస్కరణలు చేపట్టింది. ఇందులో బాగంగా ధరణి పోర్టల్‌ను […]
ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్ బుకింగ్‌లో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్ ఇన్సెంటివ్ కూపన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్ కూపన్ పొందాలంటే ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్ […]
>> వడ్డించేవాడు మనవాడే అయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు. తేడా వచ్చిందో కడుపు మాడ్చుకోవాల్సిందే. తెలంగాణలో కొందరు సీనియర్ ఐఏఎస్‌ల పరిస్థితి కూడా అలాగే ఉందట. ప్రాధాన్యం లేని పోస్టుల్లోనే రిటైరైపోతున్నారు. కళ్లముందే జూనియర్లు కీలక పోస్టుల్లో ఉంటే.. తమకీ దుస్థితి ఏంటని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట. లూప్‌లైన్‌లోనే సీనియర్ ఐఏఎస్‌ల పదవీ విరమణ! అనుభవం ఆధారంగా సీనియర్ IASలు కీలక పోస్టుల్లో కొనసాగుతారు. కొందరైతే రిటైర్మెంట్ టైమ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. కానీ.. తెలంగాణలో తమ […]
మాములుగా మనకు ప్రమోషన్స్ కావాలంటే బాస్ ను కాకాపడతారు. రాజకీయంగా ఎదుగుదల కావాలంటే పైస్థాయిలో ఉండే నేతలను, మంత్రులను కాకాపడుతుంటాం. మంత్రి పదవులు కావాలంటే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అయితే, ఓ మంత్రికి డెప్యూటీ సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నది. ఆ విషయాన్ని అధిష్టానం ముందుకు తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా భగవంతుడిని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. కర్ణాటక మంత్రి బి శ్రీరాములు నిన్నటి రోజున కలబుర్గి లోని దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శించారు. తన మనసులోని […]
జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు బీహార్ మహిళలంతా అండగా నిలుస్తున్నారు. జేడీయూను గెలిపించి ఎలాగైనా నితీశ్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచీ రసవత్తరంగా సాగుతున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి దూసుకెళుతోంది. నితీశ్ కుమార్ విధానాలను బీహార్‌లోని పురుష ఓటర్లు విభేదిస్తున్నా.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనను ఆదరిస్తున్నారు. ఇదే విషయంపైనే ఇప్పుడు స్థానిక గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమి భాగస్వాములైన బీజేపీ-జేడీయూల్లో బీజేపీయే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో […]