ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. తమతో కలవకుండా వీఆర్వోలను కొన్ని ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ ఏపీ జేఏసీ అమరావతి సంఘం ఛైర్మన్ బొప్పరాజు విమర్శలు గుప్పించారు. పరోక్షంగా ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి పై బొప్పరాజు ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ… వీఆర్వో సంఘాలు మా ఏపీ జేఏసీతో కలవడం కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకి ఇష్టం లేదు. అందుకే వీఆర్వో సంఘాల నేతలపై బెదిరింపులకి పాల్పడుతున్నారు. వీఆర్వోల పై ఏసీబీతో దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఆ సంఘాల నాయకుల వివరాలు బయటపెడతాం. వీఆర్వోల ప్రమోషన్ వివాదం అనేక రోజులుగా సాగుతున్న మాట వాస్తవమే.. అది పరిష్కరించాలని నిర్ణయించాం అని ఆయన తెలిపారు.