మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కన్నప్ప దాదాపుగా పూర్తయింది..సినిమాని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటినుంచి గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది సినిమా టీం. కాదేది ప్రమోషన్ కి అనర్హం అన్నట్టు జ్యోతిర్లింగాల యాత్ర, చార్ధామ్ యాత్ర సహా మహా కుంభమేళాకి కూడా వెళ్లి ప్రమోషన్ చేసి వచ్చింది సినిమా టీం. అయితే ఎంత ప్రమోట్ చేస్తున్నా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడడం గగనం అయిపోయింది. ఈ మధ్యకాలంలో మీడియా ఇంటర్వ్యూలు కూడా […]
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఒక అపశృతితో వార్తల్లో నిలిచింది. ఈ ప్రముఖ జాతరలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన సమయంలో, టీడీపీ నాయకుడు ఆర్వీటి బాబు, సినీ నటుడు, కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ ద్వారా ఆలయం పై పూలు చల్లే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రయత్నం భక్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగించడమే కాకుండా, ఒక పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించింది. జాతర సందర్భంగా […]
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలని సీఎం జగన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది, ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశారు. రైతులకు ఇబ్బంది […]
Book Launch: ఆర్ధిక శాస్త్రంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఆకిన వెంకటేశ్వర్లు తాజాగా పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లోని సెస్‌లో మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సీహెచ్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం 572 పేజీలలో 22 అధ్యాయాలుగా విభజించబడింది. ఇందులో ముఖ్య విషయాలన్నీ భారత దేశ వ్యవసాయ రంగం, అభివృద్ధి, ఎత్తుపల్లాల గురించి ఉంటుంది. బ్రిటీష్ వారు భారతదేశ వ్యవసాయాన్ని […]