యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్డమ్ సినిమాతో తన కెరీర్‌కు మంచి స్థానం సొంతం చేసుకున్న విజయ్‌కు ఈ ప్రాజెక్ట్ పై అనేక మంది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ శంకర్‌తో సినిమా చేయడం వల్ల మీ కెరీర్ స్మాష్ అవుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Also Read : Mahavatar […]
హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నర్సింహా’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరకొడుతుంది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా, ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా అశ్విన్ కుమార్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరారు. అశ్విన్ కుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు – రైటర్, ఎడిటర్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన స్థాపించిన క్లీమ్ VFX స్టూడియో, […]
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కి ముంబై ఎయిర్‌పోర్టులో ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది. అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ కోసం ముంబై చేరుకున్న బన్నీ, సాధారణ ప్రయాణికుడిలా కళ్లజోడు, మాస్క్ ధరించి ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టారు. కానీ చెకింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ ఆయనను గుర్తించలేదు. పక్కన ఉన్న అసిస్టెంట్ వెంటనే ‘ఈయన అల్లు అర్జున్ గారు’ అని చెప్పినా, సెక్యూరిటీ మాత్రం తన డ్యూటీకి కట్టుబడి ‘ముఖం చూపించాలి’ అని గట్టిగా అన్నాడు. Also […]
సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. Also Read : Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత […]
టాలీవుడ్లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్‌లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. Also Read : Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్ […]
తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్‌లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని […]
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత […]
టాలీవుడ్లో ఎప్పుడూ కొత్త జోడీలపై ప్రేక్షకులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో తొలిసారి జత కడుతున్న టాప్ హీరోయిన్ల సినిమాలు ఎప్పుడు హైప్ క్రియేట్ చేస్తాయి. అలాంటి క్రేజ్ ఇప్పుడు నితిన్ – పూజా హెగ్డే జోడీపై నెలకొంటోంది. కొంతకాలంగా తెలుగు తెర నుంచి దూరంగా ఉన్న పూజా, మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తోందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది. Also Read : Peddhi : బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ స్టార్ హీరోయిన్‌తో […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీపై మరొక ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్‌లో హీట్ పెంచుతోంది. కథలో భాగంగా ఒక మాస్ నెంబర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొదట […]
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటి స్మృతి ఇరానీ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న హిట్ ధారావాహిక ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ తో బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు ఇటీవల తెగ చెలరేగాయి. అయితే ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరగడం తో, స్మృతి ఇరానీ ఈ రెమ్యునరేషన్ గురించి ఓ […]