ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో టాలీవుడ్‌కి కొత్త జోష్ తెచ్చిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ తన ఉత్సాహం, హాస్యంతో ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. తాజాగా ఆయన జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’లో గెస్ట్‌గా హాజరై తన స్టైల్లో సందడి చేశాడు. షోలో జగపతిబాబు అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు డీఎస్పీ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Rashmika :చావా నుంచి థామా వరకు.. 2025 లో రష్మిక దుమ్ము రేపిన కలెక్షన్లు!
“నా ఎనర్జీకి మ్యాచ్ అయ్యేది ఒక్కరే – మెగాస్టార్ చిరంజీవి గారు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి, నా పాటకు చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తే చాలు అని కలగన్నాను. ఆయన డ్యాన్స్ చూడడం అంటే నాకు ఫెస్టివల్ లాంటిది. ఆయన ఎనర్జీని వర్ణించలేం – అది మరో లెవెల్‌లో ఉంటుంది. నాకు ఇళయరాజా గారు దేవుడు లాంటి వారు. వారిని ఒకసారి అయినా కలవాలి అనేది నా జీవిత కల. ఆ కల గత ఏడాది నెరవేరింది. ఆయన నా స్టూడియో కి వచ్చారు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని క్షణం” అని తెలిపారు. అలాగే సుకుమార్ గురించి మాట్లాడుతూ..
‘నాకు సుకుమార్ అన్న లాంటివారు. మా బంధం మ్యూజిక్‌కి మించి ఉంటుంది. ఆర్య సినిమాలోని ‘అ అంటే అమలాపురం’ పాటకు చాలా టైమ్ పట్టింది. అంతకుముందు నేను ‘వంగతోట మలుపు కాడా’ సాంగ్ కంపోజ్ చేశాను. ఆ పాట విని సుకుమార్ అలాంటి వైబ్ ఉన్న మరో పాట కావాలని చెప్పారు. ఫలితం – రెండు సూపర్ హిట్స్ అయ్యాయి” అని తెలిపారు.
హీరో అవుతావా..? పెళ్లి చేసుకుంటావా? అని అడగా దేవిశ్రీ నవ్వుతూ.. “పెళ్లి చేసుకుంటావా అన్న ఆప్షన్ పక్కన ఏది పెట్టిన, నేను అదే ఎంచుకుంటా! కానీ ముందుగా హీరో అవుతా! చాలా స్క్రిప్ట్ వస్తున్నాయి. నచ్చిన కథ దొరికితే నటన వైపు అడుగు వేస్తా’ మొత్తానికి, దేవిశ్రీ ప్రసాద్ ఈ ఇంటర్వ్యూలో తన హాస్యంతో, ఎనర్జీతో జయమ్ము నిశ్చయమ్ము రా స్టేజ్‌ని మొత్తం హైలైట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా, త్వరలో హీరోగా కూడా దేవిశ్రీని చూడబోతున్నామేమో చూడాలి!