నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ మూవీ 1990లో విడుదలై, ట్రెండ్ సెటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల తర్వాత, ‘శివ’ మరోసారి వెండితెరపై రానుంది. అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా నాగార్జున స్వయంగా ఈ రీరిలీజ్‌ను ప్రకటించారు. నవంబర్ 14న ‘శివ’ థియేటర్లలోకి రానుందని తెలిపారు. నాగ్ రిలీజ్ పోస్టర్‌ను షేర్ చేయగా, అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. “మళ్లీ సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్‌ని రీ–రూల్ చేయబోతున్నాడు మా శివ!” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్ పై ఇప్పటికే పలు హీరోలు రియాక్ట్ అవ్వగా ఇటివల అల్లు అర్జున్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడారు. ఇక ఇప్పుడు తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ వీడియో వదిలాడు.
Also Read : Chiranjeevi : ‘వెంకీ – చిరు’ కాంబోలో సర్ప్రైజ్ సాంగ్.. స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఫిక్స్?
సందీప్ మాట్లాడుతూ.. ‘‘శివ’ సినిమా నేను చిన్నప్పుడు చూశాను. ఆ సినిమాలోని కథ, నేపథ్యం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫ్రేమ్స్ అన్నీ నాలో చాలా లోతైన ముద్ర వేసాయి. నాగార్జున సర్ లుక్, ఆయన చూపిన ఇంటెన్సిటీ, రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్ ఇవన్నీ నన్ను మోటివేట్ చేశాయి. నిజంగా ఆ సినిమా లేకపోయి ఉంటే, నేను ఈరోజు దర్శకుడిగా ఉండేవాడిని కాదేమో’’ అని అన్నారు. అలాగే..‘‘శివ’లోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ నా మైండ్ నుంచి పోవు. ముఖ్యంగా కాలేజీ నేపథ్యంలోని సంఘర్షణ సన్నివేశాలు, సైలెంట్‌గా సాగే యాక్షన్ సీక్వెన్స్ లాంటివి ఇప్పటికీ క్లాసిక్‌లా అనిపిస్తాయి. ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించదు. ఈ నెల 14న రీ–రిలీజ్ అవుతుందన్న వార్త విన్నాక మళ్లీ థియేటర్‌లో చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. అంటే మొత్తానికి, దర్శకుడిగా వంగా తన మైండ్‌సెట్, స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీద రామ్‌గోపాల్ వర్మ ‘శివ’ సినిమా చూపించిన ప్రభావం ఇంకా తగ్గలేదని స్పష్టమవుతోంది.