మెగాస్టార్ చిరంజీవి మరోసారి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ స్టైల్‌కు తగ్గ పంచ్ డైలాగులు, వెంకీ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ మసాలా ఈ మూడు కలయికలో వచ్చే ఈ సినిమా 2025 సమ్మర్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. అయితే..
Also Read : Lavanya-Varun Tej : యానివర్సరీ సెలబ్రేషన్స్ లో.. లావణ్య వరుణ్ స్పెషల్ పోస్ట్
ఈ సినిమాలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కొత్త అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం ప్రకారం, ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సాంగ్‌ను చిరు–వెంకీ కాంబోలోనే డిజైన్ చేయాలని అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నాడట. దీనికోసం, ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయడం కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉందని టాక్. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవబోతోందని ఫిల్మ్ యూనిట్ చెబుతోంది. చిరు సినిమాల్లో డ్యాన్స్, ఎనర్జీ, కామెడీ అన్నీ కలిపి.. ఈ సాంగ్‌ను మరింతగా హైలైట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో నటించే స్టార్ హీరోయిన్ ఎవరో త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.