ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరుకోలేదు అనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టీం ఇండియా ఓడిపోయిన రెండు మ్యాచ్ లలో టాస్ ప్రధాన పాత్ర పోషించిందని అన్నాడు. టాస్ ఓడిపోవడం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆ మిగిత జట్లకు కలిసి వచ్చింది అన్నారు. అయితే ఈ మాటలను కొట్టిపారేశారు భారత సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్. భారత్ ఓటమిని టాస్ తో ముడి పెట్టడం తప్పు అన్నారు. ఆ మ్యాచ్ లలో మన ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేదు అని తెలిపారు. ఆఫ్ఘానిస్తాన్ పైన కూడా టీం ఇండియా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి విజయం సాధించింది అని తెలిపారు. ఎందుకంటే ఆ మ్యాచ్ లో మన బ్యాటర్లు బాగా ఆడారు. ముందు రెండు మ్యాచ్ లలో అలా ఆడలేకపోయారు అని అన్నారు.