టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ కు చేరాక పోవడం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని అన్నాడు. యూఏఈ లో ఉన్న తేమ ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే పూర్తిగా అడ్వాంటేజ్‌గా మారిందన్నాడు. టీ20 ఫార్మాట్ లో టాస్‌కు ఇంత ప్రాధాన్యత ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఐపీఎల్ 2021 సీజన్, టీ20 ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఆటగాళ్లకు ఉంటే బాగుండేదన్నాడు. గత ఆరు నెలలుగా భారత ఆటగాళ్లు బిజీగానే ఉన్నారు. కనీసం వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లలేదు. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడ్డప్పుడే చిన్న బ్రేక్ దొరికింది. ఆ తర్వాతి నుంచి బయో బబుల్‌లోనే ఉంటున్నారు. అది ఆటగాళ్ల మానిసిక స్థితి పై ప్రభావం చూపించినట్లు కనిపిస్తుంది. ఐపీఎల్, టీ 20 ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఉంటే ఆటగాళ్లు రిఫ్రెష్ అయ్యేవారు అని పేర్కొన్నారు.