Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ పాలన మరింత బలోపేతం.. కీలక సంస్కరణలకు పవన్ శ్రీకారం..
- పంచాయతీరాజ్ పాలన మరింత బలోపేతంపై కీలక సంస్కరణలకు పవన్ శ్రీకారం..
- పరిపాలనలో క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ మార్పులు..
- క్యాంపు కార్యాలయంలో అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష ..
- గ్రామీణాభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజా సంతృప్తి పెంచే చర్యలకు దిశానిర్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామ స్వరాజ్య సాధన దిశగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కల్యాణ్.. గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా క్యాంపు కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో .. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి హోదా, ఉద్యోగుల ప్యాట్రన్, పనితీరు వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తూ, భవిష్యత్ సంస్కరణల రూపురేఖలను మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావాలని, ప్రజలలో సేవలపై మరింత సంతృప్తి పెరగాలంటే పరిపాలన వ్యవహారాలు మారాలని ఆయన వెల్లడించారు.
Read Also: Gudivada Amarnath: విశాఖ గురించి వైఎస్ జగన్ చెప్పిందే.. చంద్రబాబు చెబుతున్నారు..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
స్వచ్చ రథం, మ్యాజిక్ డ్రెయిన్ వంటి పైలట్ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ.. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఇలాంటి నూతన ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు పవన్ కల్యాణ్.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో విస్తృత మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ కోసం సాంకేతికపరంగా శాఖను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా పథకాలు సమర్థంగా అమలు అవ్వాలని, నీటి నాణ్యత పరీక్షలు కచ్చితంగా జరుగాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ పనులను సమయానుకూలంగా చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఇక, ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షణపై కూడా విస్తృతంగా సమీక్ష నిర్వహించారు పవన్ కల్యాణ్… గ్రామ సభ తీర్మానాలకు అనుగుణంగా పనులు చేపట్టే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని, ఈ పథకం ద్వారా శ్రామికుల్లో సానుకూలత పెంచే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో తీసుకువచ్చే ప్రతి సంస్కరణ ప్రజలకు ప్రత్యక్ష మేలు చేకూర్చేలా ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు. శాఖల్లో అమలు చేయాల్సిన సంస్కరణలు, బెస్ట్ ప్రాక్టీసెస్‌పై సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని పేషీ అధికారులకు ఆదేశించారు. ఈ అంశంపై వారం రోజుల్లో మరో సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఓఎస్డీ వెంకట కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!