ప్రైవేటు ఆర్టీపీసీఆర్ లాబ్స్ ను ఆకస్మికంగా తనిఖీలు చేసారు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. ప్రభుత్వం నిర్ధేశించిన ధర కంటే అధిక రుసుములు వసూళ్ళు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పేర్కొన్నారు. మైక్రో లాబ్, మైల్ స్టోన్ లాబ్ కు లక్ష రూపాయల జరిమానా విధించారు. యూనటస్ లాబ్ పై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన పరీక్షల శాంపిల్స్ ను కావాలనే ప్రైవేటు లాబ్స్ వారు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ఇకనుండి […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పానుగంటి మాణిక్యం పెంకుటిల్లు లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెరిగాయి. ఈ ఘటన పై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరు. అయితే ఈ మంటల్లో పెంకుటిల్లు కాగా నిత్యావసర వస్తువులు. ఎలాక్ట్రానిక్ సామాగ్రి, నగదు, బంగారు ఆభరణాలు పూర్తిగా దగ్ధం […]
చెన్నై వేదికగా ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్స్. అయితే గత మ్యాచ్ లో విఫలమైన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మొదట ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ (3)ను పెవిలియన్ కు పంపిన తర్వాత వెంటనే మరో ఆటగాడు ఇషాన్ కిషన్(6) కూడా వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత ముంబై కెప్టెన్ […]
కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా, అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కాల్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని వివిధ వర్గాలు లేవనెత్తుతున్న అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాము ఎలక్షన్ కమిషన్ సూచించిన […]
న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ న్యాయవాద దంపతుల హత్య కేసు పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. అయితే వామన్‌రావు, నాగమణి హత్యకేసులో దర్యాప్తు చేసి సేకరించిన వివరాలు కోర్టుకు సమర్పించారు పోలీసులు. 15 ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు అందాయని హైకోర్టుకు తెలిపిన పోలీసులు… 15 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 32 మంది ప్రత్యక్షసాక్షుల వాగ్మూలాలు కోర్టులో నమోదు చేసారు పోలీసులు. […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది పంజాబ్. అయితే ఈ రెండు జట్లు గత ఏడాది ఐపీఎల్ లో తలపడినప్పుడు రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంటే గత మ్యాచ్ లో ఓడిన ముంబై మళ్ళీ గెలుపుబాటలోకి రావాలని చూస్తుంది. […]
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ […]
కోవిడ్ నివారణ పద్ధతులపై, వ్యాక్సినేషన్ పై మరింత అవగాహన పెంచడానికి జాతీయ సేవా పథకం, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్ లకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంలో, ప్రజలలో మంచి అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తెలిపారు. ప్రజలు సరైన విధంగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం, గుంపులుగా గుమికూడకుండా ఉండటం ఇలాంటివి కోవిడ్ నివారణ, […]
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘ది ప్రీస్ట్’. గత యేడాది జులైలో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కు కరోనా కారణంగా బ్రేక్ పడింది. దాంతో అన్ లాక్ తర్వాత షూటింగ్ ను పూర్తి చేసి, ఈ యేడాది మార్చి 11న థియేటర్లలో విడుదల చేశారు. ఏప్రిల్ 14 నుండి ఈ సినిమా అమెజాన్ లోనూ వీక్షకులకు అందుబాటులో ఉంది. మరి ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ మూవీ ‘ది […]
ఏపీలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించనుంది అని ఆళ్ళ నాని తెలిపారు. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పూర్తి స్థాయి సామర్థ్యం వరకు కరోనా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు. అలాగే […]