సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ కేంద్రం వివక్ష చూపించింది అని చెప్పిన హరీశ్ రావు కేంద్రం కొనుగోలు చేస్తే 150, రాష్ట్రాలు కొనుగోలు చేస్తే 400 వర్తించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అసలు హైదరాబాద్‌లో తయారయ్యే వాక్సిన్‌పై కేంద్రం పెత్తనం చేస్తున్నది. తెలంగాణ అంతటికీ వ్యాక్సిన్ సరఫరా చేశాకనే ఇతర ప్రాంతాలకు తరలించాలి అని పేరొన్నారు.