చెన్నై వేదికగా ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్స్. అయితే గత మ్యాచ్ లో విఫలమైన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మొదట ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ (3)ను పెవిలియన్ కు పంపిన తర్వాత వెంటనే మరో ఆటగాడు ఇషాన్ కిషన్(6) కూడా వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సూర్య కుమార్(33) ఔట్ అయిన రోహిత్ అర్ధశతకం పూర్తి చేసి 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత పంజాబ్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టగా దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే పంజాబ్ 132 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.