నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈనెల 21వ తేదీన ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (19,20,21వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి […]
బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయించారు అనో అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేషంట్ల రూపంలో వెళ్లి నిఘా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. జిల్లాలో 39 ప్రైవేట్ హాస్పిటల్స్ కు వేసిన కోటి 54 లక్షల రూపాయల పెనాల్టీని […]
నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. సుమారుగా 22.05.2021వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం […]
రెమిడెసీవర్ ఇంజెక్షన్ లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేసారు ఏపీ పోలీసులు. ఆశ్రం కొవిడ్ కేర్ హాస్పిటల్ నుండి రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టిస్తున్నారు పదిమంది ముఠా సభ్యులు. ఆ ముఠా దగ్గర నుండి 40 రెమిడెసివర్ ఇంజెక్షన్లు, 1లక్ష 45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవదిలో రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న మూడు ముఠా లను అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు కొరడా దుళిపిస్తున్న […]
నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో […]
ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే గాంధీకి వెళుతున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు ఉంచారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచాలి అని తెలిపారు. అలాగే వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు అతీగతీ లేదు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి. జూడాలతో […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తెరాస పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శీను కన్సిలర్ లతో ఈటల పై ప్రెస్ మీట్ పెట్టారు. గత రెండేళ్ల నుండి పార్టీకి అతీతంగా మాట్లాడుతున్న ఈటల మాటలతో పార్టీకి దూరమైనవు అని అన్నారు. ప్రగతి భవనంలో కేసీఆర్ సమయం ఇవ్వకపోతే ఆత్మగౌరవం అడ్డొచ్చిందా అని అడిగిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పనులమీద ఉంటాడు. మిమ్ములను స్వంత కుటుంబ సభ్యునిగా,తమ్మునిగా చూసుకున్న కెసిఆర్ మీకు ఏమి తక్కువ చేశారని […]
కరోనా విషయంలో ముఖ్యమంత్రికి ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు.. అధికారులు ఫోన్ కూడా ఎత్తరు. ముఖ్యమంత్రి లేఖలకు ప్రధానమంత్రి స్పందన కూడా ఇలాగే ఉంటుంది అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కరోనా తో ప్రజలు సహజీవనం చేయాలంటారు ఆయన మాత్రం ఇంట్లో ఉంటారు. కరోనా లేనప్పుడు కూడా అతి ఎక్కువ కాలం హోమ్ క్వారంటైన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. […]
కరోనా అంటించుకోవటం, అధికార పక్షంతో తిట్టించుకోవటం ఎందుకని అసెంబ్లీ బహిష్కరిస్తున్నాం అని టీడీపీ ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు. పక్క రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. ప్రజల గురించి మాట్లాడే చిత్తశుద్ధి […]
కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల […]