కరోనా విషయంలో ముఖ్యమంత్రికి ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు.. అధికారులు ఫోన్ కూడా ఎత్తరు. ముఖ్యమంత్రి లేఖలకు ప్రధానమంత్రి స్పందన కూడా ఇలాగే ఉంటుంది అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కరోనా తో ప్రజలు సహజీవనం చేయాలంటారు ఆయన మాత్రం ఇంట్లో ఉంటారు. కరోనా లేనప్పుడు కూడా అతి ఎక్కువ కాలం హోమ్ క్వారంటైన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ రేట్లు అమలు కావడం లేదు.. ఆరోగ్యశ్రీ కిందటేడాది బకాయిల 70 శాతం చెల్లించలేదు. ప్రస్తుతం ఆక్సిజన్, మందులు కూడా కొరత ఉంది..బ్లాక్ ఫంగస్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విశాఖ జిల్లాలో మరణాలను పరిశీలిస్తే .. రోజుకు ఎంత మంది చనిపోతున్నారో మీకే తెలుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు ప్రజలకు అండగా నిలవాలి అని పేర్కొన్నారు.